హైదరాబాద్‌లో ఐదు లక్షల ఓట్లు తొలగింపు

హైదరాబాద్‌లో ఐదు లక్షల ఓట్లు తొలగింపు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 5లక్షల41వేల201 మంది ఓట్లు తొలగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఇందులో 47,141 మంది చనిపోయినవారు, 4,39,801 మంది ఇతర ప్రాంతాలకు మారినవారు, 54,259 మంది బోగస్​ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.  కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలు మేరకే ఓట్ల తొలగింపు జరిగిందన్నారు. ఒక కుటుంబంలోని వ్యక్తుల ఓట్లు వేర్వేరు పోలింగ్​బూత్​లలో ఉండడం కారణంగా, ఓటింగ్​శాతం తగ్గుతున్నట్లు గుర్తించామన్నారు. అలాంటి వారందరి ఓట్లు ఒకే బూత్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య 3లక్షల78వేల731కి చేరిందన్నారు. లక్షా81వేల405 మందికి సంబంధించిన ఇంటి నంబర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని సరిచేశామని తెలిపారు.

హెరిటేజ్ వాక్ ను సక్సెస్​చేయండి: కమిషనర్

వరల్డ్​హెరిటేజ్ డే సందర్భంగా గురువారం నిర్వహిస్తున్న హెరిటేజ్ వాక్ ను సక్సెస్​చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ కోరారు. ఉదయం 7 గంటలకు దారూల్ షిఫా నుంచి ప్రారంభమై సాలర్ జంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆస్పత్రి వరకు వాక్ కొనసాగుతుందన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆదేశాల మేరకు ఈ వాక్​నిర్వహిస్తున్నట్లు తెలిపారు.