పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : లక్ష్మీశారద

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత : లక్ష్మీశారద

మెదక్ టౌన్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. ఆదివారం మెదక్​ జిల్లా కోర్టు ఆవరణలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటలకు ''ఏక్ తారీఖ్​ ఏక్ గంట ఏక్ సాథ్​'' అనే కార్యక్రమంలో భాగంగా ఒక గంట పాటు  శ్రమదానం చేశారు.

జిల్లా కోర్టు  ఆవరణలో జూనియర్ సివిల్ జడ్జి రీటా లాల్ చంద్​, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి  కల్పన, మున్సిపల్ చైర్మన్​ చంద్రపాల్, కమిషనర్​జానకీ రామ్​సాగర్​తో కలిసి పరిసరాల్లో ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, శానిటరీ ఇన్స్​పెక్టర్​ మహేశ్​, మెప్మా టీఎంసీ సునీత, న్యాయవాదులు, పట్టణ ప్రజలు,  మహిళా సంఘాల సభ్యులు, వార్డు ఆఫీసర్లు, జవాన్లు, శానిటేషన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.