
పెద్దపల్లి, వెలుగు: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి స్వప్నరాణి అన్నారు. నశా ముక్త్ భారత్ అభియాన్‌ల భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం అయ్యప్పగుడి చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ యువత మత్తుకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.
కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ మల్లేశ్, అడ్వకేట్ ఝాన్సీ, ఎఫ్‌ఆర్‌వో స్వర్ణలత, నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ఉమ, పాల్గొన్నారు.