
దంతాలపల్లి, వెలుగు : మరిపెడ బంగ్లాలోని రవిబాబు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా రోగులకు స్టెరాయిడ్, ఆంటీ బయోటికులు, సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ చికిత్స చేస్తుండగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రవిబాబు నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, యాంటీ బయోటిక్ ఇంజెక్షన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టొద్దన్నారు. పేరు ముందు డాక్టర్ అని రాసుకో రాదని, అర్హతకి మించి వైద్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ తదితరులు ఉన్నారు.