ఆ ముగ్గురు పిల్లలకు అండగా ఉంటాం

ఆ ముగ్గురు పిల్లలకు అండగా ఉంటాం
  • వెలుగు' కథనంపై స్పందించిన అధికారులు
  • ప్రతి నెలారూ.4 వేల చొప్పున స్పాన్సర్షిప్
  • గురుకులంలో చేర్పిస్తామని వెల్లడి
  • పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లల దీన స్థితిని వి. వరిస్తూ సోమవారం 'వెలుగు' దినపత్రికలో ప్రచురి తమైన 'పాపం పసివాళ్లు' కథనంపై జిల్లా అధికారు. లు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సంక్షేమ శాఖ అధికారి ఎ.బాస్కర్ సూచనతో బాధిత పిల్లలు. ఆ కుటుంబాన్ని జిల్లా బాలల సంరక్షణ అధికారి. బూర్ల మహేశ్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం లీగల్ ఆఫీసర్ ఎం.శ్రీనివాస్ పరామర్శించారు. పిల్లల యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని, వారికి నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేశారు. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆనాథలు గా మారిన మదాచి అజిత్ కుమార్(12), విజయ్ కుమార్ (8), శివకుమార్(2 నెలలు) ను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 4 వేల చొప్పున స్పాన్సర్షిప్ పథకం కింద అందించి వీరిని గురుకుల పాఠశాలలో చేర్చిస్తామని తెలిపారు. రెండు నెటలున్న శివకుమార్ను ప్రభుత్వానికి అప్ప ఆదిలాబాద్ లోని శిశు గృహానికి తరలించి న్యాయ బద్ధంగా దత్తత ఇస్తామని వానమ్మ,తాతలకు సూచించారు. వెలుగులో ప్రచురితమైన కథనం సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలా మంది దాతలు స్పందిస్తున్నారు. పిల్లలకు అండగా. నిలుస్తామని భరోసా ఇస్తున్నారు.

పిల్లల పరిస్థితి తెలిసి బాధ కలిగింది

పిల్లల పరిస్థితి తెలిసి చాలా బాధపడ్డానని టీఆర్ఎస్. నేత నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు మంగళవారం సిర్పూర్ నియో జకవర్గ పర్యటనలో భాగంగా పార్టి గ్రామానికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. రెండు నెలల శివను ఎత్తుకొని బాచించారు. ముగ్గురు పిల్లలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.