పెనుబల్లి మండలంలో .. బెల్ట్​షాపుల పై టాస్క్​ఫోర్స్​ దాడులు

పెనుబల్లి మండలంలో ..  బెల్ట్​షాపుల పై టాస్క్​ఫోర్స్​ దాడులు

పెనుబల్లి, వెలుగు :  బెల్ట్​ షాపుల పై జిల్లా టాస్క్​ఫోర్స్​ అధికారులు సోమవారం మెరుపు దాడులు నిర్వహించారు. పార్లమెంట్​ ఎన్నికల కోడ్​ అమల్లో వున్నందున అక్రమంగా మద్యం అమ్ముతున్న పెనుబల్లి మండలంలోని పలు గ్రామాలలో బెల్ట్​ షాపులపై జిల్లా టాస్క్​ఫోర్స్​ అధికారి కరుణశ్రీ ఆద్వర్యంలో దాడులు నిర్వహించి మద్యం ను స్వాధీనం చేసుకొని పలువురు పై కేసులు నమోదు చేశారు.

నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మిన తరలించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్​ సిబ్బంది పాల్గొన్నారు.