రజనీకాంత్ ఇంట్లో దీపావళి సందడి

రజనీకాంత్ ఇంట్లో దీపావళి సందడి

ఫోటోలను  అభిమానులకు షేర్ చేసిన కూతురు సౌందర్య

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా ఉత్సాహంగా దీపావళి వేడుక చేసుకున్నారు. తన ఇంట్లో కుటుంబ సమేతంగా పటాకులు కాల్చి సంబరంగా వేడుక జరుపుకున్నారు. దీపావళి వేడుకల్లో రజనీకాంత్ కుటుంబంతో కలసి పాల్గొన్న ఫోటోలను ఆయన కూతురు సౌందర్య సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేశారు. కరోనా తర్వాత చాలా కాలంగా అభిమానులకు దూరంగా ఉంటున్న రజనీకాంత్ ఇవాళ కొంతసేపు ఇంటి బయటకు వచ్చి అభిమానులకు దర్శనమిచ్చి వెళ్లారు. రాజకీయ రంగ ప్రవేశంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కరోనా వల్ల సినిమాల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. వీటికి తోడు రజనీకాంత్ ఆరోగ్యంపై కూడా పుకార్లు జరుగుతున్న నేపధ్యంలో సూపర్ స్టార్ అభిమానులు ఆయన అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఊహించని రీతిలో రజనీకాంత్ చాలా సంతోషంగా దీపావళి వేడుకను జరుపుకుంటున్న ఫోటోలు విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మనవడితో కలసి రజనీకాంత్ ఉత్సాహంగా టపాకులు కాలుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.