
కన్నడ బ్యూటీ నేహా శెట్టి.. తెలుగులో పలు చిత్రాల్లో నటించినా ‘డీజే టిల్లు’లోని రాధిక పాత్ర తనకు సూపర్బ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో యూత్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా ఆమె మరో బంపర్ ఆఫర్ అందుకుంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’ చిత్రంలో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తనే రివీల్ చేసింది. రీసెంట్‌గా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా.. తాను ‘ఓజీ’ చిత్రంలో సర్‌ప్రైజ్ చేయబోతున్నానని చెప్పింది. అయితే ఆమె కనిపించబోయేది స్పెషల్ సాంగ్‌లోనా, లేదంటే ప్రత్యేక పాత్రలోనా అనేది తెలియాల్సి ఉంది.
నేహాకు యూత్‌లో ఫాలోయింగ్‌తోపాటు ఈ చిత్రం తన కెరీర్‌కు ప్లస్ కానుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చిత్రంలో నటిస్తోందంటే తనకు క్రేజీ చాన్స్ అనే చెప్పాలి. సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు నేహా కూడా యాడ్ అవడం సినిమాకు మరింత గ్లామర్ టచ్ తీసుకొస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా సినిమా విడుదల కానుంది.