Djokovic: జొకోవిచ్ అరుదైన ఘనత

Djokovic: జొకోవిచ్ అరుదైన ఘనత

టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. 1973 నుంచి కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలయ్యాక అత్యధిక వారాలు  వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన  ప్లేయర్‌గా అరుదైన ఘనత సాధించాడు. గతంలో  స్టెఫీ గ్రాఫ్ 377 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగగా... ఈ రికార్డును జొకోవిచ్ బద్దలు కొట్టాడు. జొకోవిచ్ 378 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగాడు.  వీరి తర్వాత  మార్టినా 332 వారాలు, సెరెనా 319 వారాలు, ఫెదరర్ 310 వారాల పాటు నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగారు. 

ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జొకోవిచ్...తన ఖాతాలో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ వేసుకున్నాడు. దీంతో మరోసారి నెంబర్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. తాజాగా విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 6,980 పాయింట్లతో జొకోవిచ్  తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దీంతో జొకో 378 వారాలు పాటు నంబర్‌వన్‌ ర్యాంక్‌ లో నిలిచాడు. జొకోవిచ్ తొలిసారి 2011లో  నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్నాడు.