
టురిన్ (ఇటలీ): సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ఈ ఏడాదికి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఇప్పటికే 24వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించిన జొకో ఏటీపీ ఫైనల్స్‌లో రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ తుదిపోరులో నొవాక్ 6–3, 6–3తో లోకల్ ఫేవరెట్ జానిక్ సినర్ (ఇటలీ)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. ఈ విక్టరీతో ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆరుసార్లు విజేతగా నిలిచిన రోజర్ ఫెడరర్ రికార్డును నొవాక్ బ్రేక్ చేశాడు.