ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు

ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు
  • ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్సలేటివ్ కమిటీ చైర్ పర్సన్ గా నియామకం

పాలమూరు, వెలుగు: పాలమూరు ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కన్సలేటివ్ కమిటీ చైర్ పర్సన్​గా డీకే అరుణను కేంద్ర ప్రభుత్వం నియమించింది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ద్వారా రాష్ట్రంలో ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ పంపిణీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం సమర్థవంతంగా అమలు చేయడంలో ఆమె కీలకపాత్ర పోషించనున్నారు. ఈ అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు.  రైతుల సంక్షేమం లక్ష్యంగా పని చేస్తానని, ఈ బాధ్యత ద్వారా రాష్ర్టంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని డీకే అరుణ తెలిపారు.

హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన ఎంపీ

మరికల్​, వెలుగు: మండలంలోని పస్పుల గ్రామంలో ఎంపీ నిధులు రూ.2.5 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్  లైట్లను శుక్రవారం ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు.  కొత్తగా నిర్మాణం చేసిన శివాలయంలో దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీకి గ్రామస్తులు స్వాగతం పలికారు.  వానలు పడితే రైల్వే బ్రిడ్జి కిందకు నీళ్లు నిలుస్తున్నాయని వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని ఈ సమస్యను పరిష్కరించాలని పెద్దచింతకుంట బీజేపీ నాయకులు ఎంపీకి వినతి పత్రం ఇచ్చారు. ఆమె సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హమీ ఇచ్చారు.  రాష్ర్ట, జిల్లా, మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.