- మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ
గద్వాల, వెలుగు: గాంధీతో ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన పేరుపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వికసిత్ భారత లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో మార్పులు తెచ్చిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కి బదులు జి రామ్ జీ పేరు పెట్టడం జరిగిందే తప్ప అందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు.
కాంగ్రెస్ కన్నా గాంధీజీకి బీజేపీనే ఎక్కువ ప్రియార్టీ ఇచ్చిందన్నారు. కావాలనే కాంగ్రెస్ జి రామ్ జి స్కీం పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వికసిత్ భారత్ లో భాగంగా గ్రామసభలు పెట్టి వికసిత్ గ్రామాల అభివృద్ధి కోసం ఈ స్కీమ్ లో బాటలు వేస్తామన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
జూరాల ప్రాజెక్టు సేఫ్టీలో భాగంగా నిర్మించే బ్రిడ్జి నిర్మాణాన్ని తప్పనిసరిగా జూరాల ప్రాజెక్టు సమీపంలోనే నిర్మించాలని డిమాండ్ చేశారు. కొత్తపల్లి దగ్గర నిర్మించే బ్రిడ్జిని చేపట్టిన తమకు అభ్యంతరం లేదని కానీ సేఫ్టీలో భాగంగా మాత్రం తప్పకుండా మరో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
