సీఎం కేసీఆర్ కు మెంటలెక్కింది : డీకే అరుణ

సీఎం కేసీఆర్ కు మెంటలెక్కింది : డీకే అరుణ

ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ. ఎన్నో ఏళ్లు సేవలందించే భవనాలను కూలగొట్టాలన్న ఆలోచన ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి సర్వం తానే అనీ.. సర్వాంతర్యామి తనే అనుకునే ఓ మానసిక రోగం తో సీఎం కేసీఆర్ బాధపడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు. ఆయన మానసిక స్థితి సరిగా లేదన్నారు. ఇలాంటి సీఎం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సమర్థించొద్దని కోరారు డీకే అరుణ.

సీఎం కేసీఆర్ పిచ్చి తుగ్లక్ గా వ్యవహరిస్తున్నారని.. ప్రజా ధనం వృధా చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి అన్నారు