సీమ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలే

సీమ ప్రాజెక్ట్‌ను కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలే

కృష్ణ జలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం  కేసీఆర్ చేయలేదన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన డీకే అరుణ.. కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయారన్నారు.

66 శాతం కృష్ణ నది పరివాహక ప్రాంతం ఉండగా 535 TMCలు రావాల్సి ఉందన్నారు. 299 TMC ల వాటాను మాత్రమే తీసుకోవడానికి కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. పంతాలు, పట్టింపులకు వెళ్లి జూరాల దగ్గర ప్రాజెక్టు ని మార్చారని ఆరోపించారు. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారన్నారు. 203 జీవో విడుదల చేసి 6 వేల కోట్లతో ఉత్సాహంగా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. లోపాయకారి అగ్రిమెంట్ లోనే రాయల సీమ ప్రాజెక్టు నడుస్తోందన్నారు. అటు,ఇటు ఒకే కాంట్రాక్టర్ ఉన్నప్పటికీ ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపలేదని ప్రశ్నించారు. KRMB  టేలిమెట్రిస్ ఏర్పాటు చేయాలని సూచించినా ఇప్పటికి ఏర్పాటు చేయలేదు..ఏ ఒప్పందం తో కృష్ణ జలాలను తాకట్టు పెట్టారని కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నానన్నారు. కేసీఆర్ కి తెలంగాణ ప్రజల ఉసురు తగలక మానదన్నారు.

కుర్చీ వేసుకొని కడతానన్న కేసీఆర్ 7 ఏళ్లుగా ఎక్కడున్నారని ప్రశ్నించారు డీకే అరుణ. 7 ఏళ్లుగా ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదన్నారు .జూరాల దగ్గర రోజు 5 TMC ల నీరు తీసుకునే విధంగా ప్రాజెక్టు కట్టాలని డిమాండ్  చేశారు.బీజేపీ.. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉందన్న డీకే అరుణ.. హుజురాబాద్ ఉప ఎన్నికల క్రమంలో కేసీఆర్ కు దళితులపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.