DK Shivakumar: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ వేదికను బెంగళూరు చిన్నస్వామి స్టేడియం నుంచి అహ్మదాబాద్‌కు మార్చడంపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఈ అంశంపై కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేదిక మార్పుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
డీకే శివకుమార్ అసంతృప్తి:
మీడియాతో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అన్యాయం జరగలేదు.. కానీ మన కర్ణాటక యువతకు, బెంగళూరు నగరానికి తీవ్ర అన్యాయం జరిగింది అని ఓపెన్ గానే ఆరోపించారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోనే జరగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో బీసీసీఐ (BCCI) ఈ హై-వోల్టేజ్ పోరుని అహ్మదాబాద్‌కు తరలించింది.. గతంలో ఏం జరిగిందో దాన్ని మర్చిపోయి, మేము సరికొత్తగా ముందడుగు వేస్తామని డీకే స్పష్టం చేశారు.
ఫైనల్ మ్యాచ్ ఎందుకు తరలించారంటే?:
గత నెలలో బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఈ వేదికల మార్పుపై అసలు కారణాన్ని వెల్లడించారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అనుమతించిన కోటా కంటే మించి, భారీ సంఖ్యలో 'కాంప్లిమెంటరీ టికెట్లు' (ఉచిత టికెట్లు) డిమాండ్ చేయడమే దీనికి కారణమని పేర్కొన్నారు.
ఐపీఎల్ ప్రోటోకాల్ ప్రకారం:
డిఫెండింగ్ ఛాంపియన్స్ తమ హోమ్ గ్రౌండ్‌లో ఫైనల్‌తో పాటు ఒక ప్లేఆఫ్ మ్యాచ్ నిర్వహించే హక్కు ఉంటుంది. ఆ లెక్కన ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోనే ఈ మ్యాచ్‌లు జరగాలి.. కానీ హోస్ట్ అసోసియేషన్లకు కేవలం 15 శాతం సీటింగ్ కెపాసిటీ మాత్రమే కాంప్లిమెంటరీ టికెట్ల రూపంలో ఇచ్చే రూల్ ఉంది. కేఎస్‌సీఏ అంతకంటే ఎక్కువ టికెట్లు అడగడంతో బీసీసీఐ కోపంతో మ్యాచ్‌లను ఇతర రాష్ట్రాలకు తరలించింది.
* క్వాలిఫైయర్ 1 (మే 26): ధర్మశాల
* ఎలిమినేటర్(మే 27): న్యూ చండీగఢ్
* క్వాలిఫైయర్ 2 (మే 29): న్యూ చండీగఢ్
* ఫైనల్ (మే 31): నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ALSO READ : కప్పు గెలిచిన ఆర్సీబీ.. బెంగళూరులో లేని విక్టరీ పరేడ్..
దుమ్మురేపిన ఆర్సీబీ:
వేదిక మారినా, స్టేడియం మారినా ఆర్‌సీబీ రేంజ్ ఏమాత్రం మారలేదు. ఆదివారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్మురేపింది. కింగ్ విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75* నాటౌట్) విశ్వరూపం చూపించడంతో 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ ఈజీగా ఛేదించింది. ఈ గెలుపుతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) సరసన చేరి.. వరుసగా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్స్ నెగ్గిన మూడో జట్టుగా చరిత్ర సృష్టించింది.
