సిద్ధారామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు

సిద్ధారామయ్యతో ఎలాంటి విభేదాలు లేవు

కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే శివకుమార్ తెలిపారు. ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయని కమలనాథులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం సిద్ధారామయ్య, తనకు ఎలాంటి విభేధాలు లేవని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న కుట్రలో భాగమేనన్నారు. కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థి విషయంపై సిద్ధారామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. సీఎం అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

జ్ఞానవాపి మసీదుపై ముగిసిన విచారణ..తీర్పు రిజర్వ్

కేసీఆర్ చేసేది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ