జ్ఞానవాపి మసీదుపై ముగిసిన విచారణ..తీర్పు రిజర్వ్

జ్ఞానవాపి మసీదుపై ముగిసిన విచారణ..తీర్పు రిజర్వ్

జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి కోర్టులో విచారణ పూర్తైంది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కోర్టు హాలులోకి 19మంది న్యాయవాదులు, నలుగురు పిటిషనర్లతో సహా 23మందిని మాత్రమే అనుమతించారు. హిందూ, ముస్లిం సంఘాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును పెండింగ్ లో పెట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత జ్ఞానవాపి వివాదంపై విచారణ జరిపింది వారణాసి కోర్టు. శివలింగం ఉందంటున్న ప్రాంతంలో పూజలకు అనుమతించాలని కోరారు హిందూ సంఘాల తరఫు లాయర్. అయితే మసీదు వద్ద ఉన్నది శివలింగం కాదని..ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదిస్తోంది. అదేవిధంగా 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద జ్ఞానవాపి సర్వేను పరిగణలోకి తీసుకోవాలని కోరుతోంది.

కాగా జ్ఞాన్ వాపి మసీదు కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది సుప్రీంకోర్టు. జిల్లా జడ్జి ఈ కేసును విచారణ జరిపితే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది జస్టిస్ చంద్రచూడ్ బెంచ్. ఇక జ్ఞానవాపి మసీదులో హిందూ దేవుళ్ల ఆనవాళ్లు ఉన్నాయని సర్వే​లో తేలినట్లు తెలుస్తోంది. మసీదు పిల్లర్లపై కలశం, పుష్పాలు చెక్కిన గుర్తులు ఉండగా..మసీదు వద్ద ఉన్న కోనేరులో 2.5 ఫీట్ల శివలింగం ఉందని పిటిషనర్లు చెప్పగా, అది ఫౌంటైన్ అని మసీదు కమిటీ వాదించింది. 

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్ చేసేది రుణమాఫీ కాదు వడ్డీ మాఫీ

కొడుకు ఫోటో షేర్ చేసిన కేన్ విలియమ్సన్