హైదరాబాద్, వెలుగు: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాలను ఐటీ హబ్‌గా మారుస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా దుష్ప్రచారమేనని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు.ఇలాంటి ఫేక్ న్యూస్ ను ఎవరూ నమ్మవద్దని కోరారు.
త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో పాటు సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా.. రెండు రోజులుగా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఈ దుష్ప్రచారం వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే అదంతా ఉత్త ఊహాగానాలేనని డీఎంఈ అధికారికంగా ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు.
