పరిధి దాటి ట్రీట్​మెంట్​ చేస్తే చర్యలు : డీఎంహెచ్​వో సుదర్శనం

పరిధి దాటి ట్రీట్​మెంట్​ చేస్తే చర్యలు : డీఎంహెచ్​వో సుదర్శనం

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని ఆర్​ఎంపీ, పీఎంపీలు ప్రాథమిక చికిత్స​ మాత్రమే చేయాలని, పరిధి దాటి వ్యవహరిస్తే యాక్షన్ తీసుకుంటామని డీఎంహెచ్​వో సుదర్శనం వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఆయన తన ఆఫీస్​లో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు.

ఆర్​ఎంపీ, పీఎంపీల సేవలను తాము గౌరవిస్తామని, ఓవర్​డోస్​ మందులు ఇవ్వడం, సెలైన్​ఎక్కించడం చేయొద్దన్నారు. హెల్త్​ఇష్యూస్​తో వచ్చే వారికి తెలిసిన మేరకు టాబ్లెట్స్​ఇచ్చి హాస్పిటల్ వెళ్లి ట్రీట్​మెంట్​పొందేలా ప్రోత్సహించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ యూనియన్​ లీడర్లు ఉన్నారు. కాగా సిటీ శివారులోని అర్సాపల్లిలో ఎం.శ్రీనివాస్​అనే  పీఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్​కు బుధవారం సాయంత్రం తాళం వేశారు. డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్​ అంజన, డాక్టర్​ వెంకటేశ్​ వెళ్లి నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న క్లినిక్​ను క్లోజ్​చేశారు.