సీజనల్ వ్యాధులపై అలర్ట్

సీజనల్ వ్యాధులపై అలర్ట్

ధర్మసాగర్/ కొత్తగూడ (గంగారం)/ బచ్చన్నపేట, వెలుగు: సీజనల్​ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల డీఎంహెచ్​వోలు సూచించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలో నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమం, ఫీవర్ సర్వే హెల్త్ క్యాంపులను డీఎంహెచ్​వో అప్పయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్​ డీఎంహెచ్​వో మదన్​మోహన్​రావు, ఇతర అధికారులు, ఆశ కార్యకర్తలతో కలిసి నీటినిల్వ ప్రదేశాలను పరీక్షించి, పలు సూచనలు చేశారు. 

 మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం గంగారం, కోమట్లగూడెం పీహెచ్​సీలు, దుబ్బగూడెం, మర్రిగూడెంలలోని ఆయుష్మాన్​ హెల్త్​ సెంటర్లను డీఎంహెచ్​వో రవిరాథోడ్​ తనిఖీ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని డీహెంహెచ్​వో మల్లికార్జున్​ సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, డాక్టర్లు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. అనంతరం 23మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను అందజేశారు.