కృత్రిమ గర్భధారణలో నిజం నిగ్గు తేల్చే డీఎన్ఏ

కృత్రిమ గర్భధారణలో  నిజం నిగ్గు తేల్చే డీఎన్ఏ
  •  కొత్త ప్రక్రియను ప్రారంభించిన ట్రూత్​ల్యాబ్స్, జీనోమ్ ఫౌండేషన్ 

ట్యాంక్ బండ్, వెలుగు : సరోగసీ, ఐవీఎఫ్, ఐయూఐ పద్ధతిలో పిల్లలను కనే తల్లిదండ్రులు మోసపోకుండా ట్రూత్ ల్యాబ్స్ జీనోమ్ ఫౌండేషన్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ తో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ గాంధీ తెలిపారు. మంగళవారం హైదరాబాద్​లోని ఆఫీసులో మాట్లాడుతూ సంతానలేమితో బాధపడుతున్న తల్లిదండ్రులను కొన్ని ప్రైవేట్ క్లినిక్స్​ మోసం చేస్తున్నాయని, వాటికి చెక్​పెట్టేందుకు తమ డీఎన్​ఏ ఫింగర్​ప్రింట్​టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు.

మాయమవుతున్న విశ్వసనీయతను నిలబెట్టేందుకు, ఖర్చు తగ్గించడానికి, ఖచ్చితత్వం కోసం తాము సేవాభావంతో ముందుకు వచ్చామన్నారు. జీనోమ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కనక భూషణం, డాక్టర్ లక్ష్మి, ప్రసాద్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుమ ప్రసాద్, డీఎన్ఏ ఎగ్జామినర్ డాక్టర్ విజయ్, శాస్త్రి పాల్గొన్నారు.