Hari Hara Veera Mallu OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘హరి హర వీరమల్లు’.. మొత్తం బాక్సాఫీస్ ఎన్ని కోట్లంటే?

Hari Hara Veera Mallu OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘హరి హర వీరమల్లు’.. మొత్తం బాక్సాఫీస్ ఎన్ని కోట్లంటే?

పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

ఈ క్రమంలో నెల రోజుల్లోపే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ బుధవారం (ఆగస్టు 20) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది. అయితే, ఈ  భారీ హిస్టారికల్ మూవీ ఆగస్టు 22 నుంచి వస్తుందని అందరూ భావించినా.. రెండు రోజుల ముందే ఓటీటీలోకి రావడం విశేషం.

ఈ క్రమంలో వీరమల్లు ప్రొడక్షన్ హౌస్ మెగా సూర్య ప్రొడక్షన్ ట్వీట్ చేసింది. “తిరుగుబాటు, ఆగ్రహం, నీతికి సంబంధించిన కథ ఇది. థియేటర్లలో మొదలైన ఈ తుఫాను ఇప్పుడు మీ స్క్రిన్లను తాకనుంది. హరి హర వీరమల్లు స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ఆగస్టు 20 నుంచి ప్రైమ్ వీడియోలో చూడండి” అంటూ క్యాప్షన్ ద్వారా ఓటీటీ అప్డేట్ ఇచ్చింది.

వీరమల్లు బాక్సాఫీస్:

వీరమల్లు నిర్మాణం, రెమ్యునరేషన్స్, ప్రమోషన్ ఖర్చులు అన్ని కలుపుకుని సుమారు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఫస్ట్ వీకెండ్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. కానీ, ఇండియాలో మాత్రం ఆ మైల్ స్టోన్ చేరుకోలేకపోయింది. ఓవరాల్గా 14 రోజుల్లో రూ. 84.55 కోట్ల ఇండియా నెట్, వరల్డ్ వైడ్గా రూ.120 కోట్లకి పైగాగ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. 

వీరమల్లు మూవీ తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి..రూ.103.50 కోట్ల బిజినెస్ చేయగా..  వరల్డ్ వైడ్గా రూ.126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణుల టాక్. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా రూ.128 కోట్ల షేర్, రూ.260 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉండేది. కానీ, రూ.120 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. 

సినిమాకు ఓపెనింగ్ (రూ.41 కోట్లు) బానే వచ్చినప్పటికీ.. నెగటివ్ రివ్యూలతో తర్వాత కలెక్షన్లు భారీగా పతనమయ్యాయి. దానికితోడు దారుణమైన VFXతో, సెకండాఫ్ లోని కథనాలు..  ఫ్యాన్స్ని తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ తప్పులు గమనించిన మేకర్స్.. వెంటనే రియాక్ట్ అయ్యి.. కాస్త మార్చి తిరిగి కొత్త కంటెంట్ తీసుకొచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.