
హైదరాబాద్, వెలుగు : ఉప్పల్, మేడి పల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో బీజేపీ నాయకుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. హోలీ పండుగ సందర్భం గా పిట్టల బస్తీ, చెంగిచర్లలో జరిగిన గొడవలో బాధితులను పరామర్శిం చడానికి వెళ్లినప్పుడు బండి సంజయ్ పై ఈ కేసులు నమోదయ్యాయి. ఆయనను ఈ నెల 11 వరకు అరెస్టు చేయరాదని జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, కేసు దర్యాప్తును కొనసాగించవచ్చునని తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసుల ను జారీ చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈలోగా పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలన్నారు.