ఆ భూములను ఎవరూ కొనద్దు

ఆ భూములను ఎవరూ కొనద్దు

సుదన్​పల్లి భూములపై మావోయిస్ట్​ పార్టీ లేఖ

హైదరాబాద్​:  హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం సుదన్​ పల్లి గ్రామంలోని పెసలు రాంచంద్రారెడ్డికి చెందిన భూములను ఎవరూ కొనద్దని మావోయిస్ట్​ పార్టీ  హెచ్చరించింది. ఈ మేరకు మావోయిస్ట్​పార్టీ కార్యదర్శి వెంకటేష్​ పేరుతో ఓ లేఖ విడుదల చేసింది. తిక్క దేవేందర్​ అనే వ్యక్తి మావోయిస్ట్​ పార్టీ పేరు చెప్పి భూములను అమ్మించడానికి రామచంద్రారెడ్డితో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపించింది. ఆ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారని వెల్లడించింది. రాంచంద్రారెడ్డితో ప్రజలు పోరాడి సాధించుకున్న ఆ భూములలో గత 35 నుంచి 40 ఏండ్లుగా పేదలు  సాగు చేసుకుంటున్నారని పేర్కొంది.ఆ  భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని తెలిపింది.ఆ భూముల్లో ఎవరైనా ప్లాట్లు కొంటే వెంటనే వదిలి పెట్టాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురువుతారని  ఆ లేఖలో హెచ్చరించింది.