పోటీచేయను..సర్వే మాత్రమే చేస్తా: లగడపాటి

పోటీచేయను..సర్వే మాత్రమే చేస్తా: లగడపాటి

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్ళీ ప్రత్యేక్ష రాజకీయాలలోకి వస్తారని..నరసరావుపేట నుంచి టీడీపీ తరఫున తాను పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పోటీ చేసే విషయంపై లగడపాటి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని… కేవలం సర్వే మాత్రమే చేస్తానన్నారు. తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదని, ప్రత్యక్ష రాజకీయాలకూ దూరంగా ఉన్నానని చెప్పారు. తన సర్వే రిపోర్టును ఏప్రిల్‌ 11వ తేదీ తర్వాత విడుదల చేస్తానని, ఇప్పటికే సర్వే ప్రక్రియను ప్రారంభించానని తెలిపారు. ప్రత్యేక హోదా అంశం ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తోందన్నారు. జాతీయ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్ లాంటి సెంటిమెంట్లు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు లగడపాటి.