వినాయక చవితిని రాజకీయం చేయవద్దు: గంగుల

వినాయక చవితిని రాజకీయం చేయవద్దు: గంగుల

కరోనా వైరస్  దృష్ట్యా ఈ ఏడాది ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వినాయకచవితిని ప్రజలు వారి ఇళ్లలోనే నిర్వహించుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇండ్లలోనే నిర్వహించుకోవాలి. కాలుష్య నియంత్రణను అరిక్టేలా మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ, హరిత తెలంగాణ  ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  కరోనా ఒక హిందువులకే కాదు అందరికి వస్తుందన్న గంగుల.. రంజాన్ పండుగ సందర్భంలో ముస్లింలు సహకరించారన్నారు. వినాయక చవితిని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. వినాయక చవితి మండపాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించడం లేదని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్న కరోనా విజృబించే ప్రమాదం పొంచి ఉందన్నారు. దయచేసి పండగలను రాజకీయం చేయవద్దని కోరారు మంత్రి గంగుల కమలాకర్ .