డిన్నర్లో ఇవి తినొద్దు

డిన్నర్లో ఇవి తినొద్దు

డిన్నర్ వీలైనంత తొందరగా తింటే మంచిదని డాక్టర్స్ చెప్తారు. 8 గంటల్లోపే తినేస్తే, డైజెస్ట్ అవ్వడానికి తగిన టైం ఉంటుంది. రాత్రి పూట తేలికగా అరిగే ఫుడ్ తినడం బెటర్. అందుకు కొన్ని రకాల ఫుడ్స్ తినకుండా ఉండాలి.

రాత్రిపూట తినే ఫుడ్ నిద్ర మీద ఎఫెక్ట్​ చూపిస్తుంది. అందుకే రాత్రి తక్కువగా తినడం చాలా మంచిది. నిద్రకు కనీసం ఒక గంట ముందైనా తినాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాత్రి భోంచేయకుండా ఎప్పుడూ పడుకోకూడదు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో, నైట్ డిన్నర్ కూడా అంతే. బరువు తగ్గాలనుకునేవాళ్లు రాత్రి కొంచెం తక్కువగా తినడం మంచిది. శరీరం ఒక్కో రకమైన ఫుడ్​కు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా తినాలి. లేకపోతే డైజెషన్, బాడీ వెయిట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. రాత్రి పూట ఫుడ్ అరగడానికి పట్టే టైం డే టైం కన్నా ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో గ్యాస్, ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, గుండెలో మంట, నిద్రలేమి, బరువు పెరగడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటివాళ్లు డిన్నర్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. సరైన టైంకి తినడం మాత్రమే కాదు... ఏం తినాలో, తినకూడదో కూడా తెలుసుకోవాలి అంటోంది సీనియర్ డైటీషియన్ పి.స్వాతి. హెవీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్​కి నో చెప్తేనే మంచి నిద్ర పడుతుంది. హెల్దీగా ఉంటారు. అలా ఉండాలంటే డిన్నర్​లో ఈ ఫుడ్స్ తినొద్దు. 

వేపుళ్లు

డీప్ ఫ్రై వంటకాలు అస్సలు తినకూడదు. చికెన్ ఫ్రై, పన్నీర్ ఐటమ్స్ లాంటివి డిన్నర్​లో వద్దే వద్దు. వీటి వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది. 

ఫ్యాటీ ఫుడ్స్

నైట్ పార్టీలకు వెళ్లినా సరే, వీలైనంత వరకు ఫ్యాటీ ఫుడ్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బాడీలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. నిద్ర సరిగా పట్టదు. మర్నాడు ఉదయం కూడా యాక్టివ్ గా పని చేయలేరు. 

స్టార్చీ ఫుడ్స్

డయాబెటిక్ ఉన్నవాళ్లు రాత్రిళ్లు పిండిపదార్థాలకు దూరంగా ఉండాలి. వీటి వల్ల బ్లడ్ షుగర్, ఇన్సులిన్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. బాడీ మెటబాలిజం దెబ్బతింటుంది. బాడీ వెయిట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది.

స్పైసీ ఫుడ్స్

రాత్రి పూట బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటి ఫుడ్ ఐటమ్స్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు తినకూడదు. ఇవి హార్ట్ కాంప్లికేషన్స్ కూడా కలిగిస్తాయి. గొంతులో పులుపెక్కిన ఫుడ్ పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది. అజీర్ణంతో కడుపునొప్పి కూడా వస్తుంది. 

హై ప్రొటీన్ ఫుడ్స్

సోయా ప్రొడక్ట్స్ వంటివి చాలా ఎక్కువ ప్రొటీన్లతో ఉంటాయి. ఇలాంటివి కూడా రాత్రిపూట ఇబ్బంది కలిగిస్తాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్​ ఎక్కువగా రిలీజ్​ అవుతుంది. 

కార్బోహైడ్రేట్స్ 

శరీరానికి ఎనర్జీ ఇచ్చేవి కార్బోహైడ్రేట్స్. అయితే నైట్ టైం మాత్రం ఈ  ఫుడ్స్ తినకపోతేనే బెటర్. ఇవి బ్లడ్​లో కలిసినప్పుడు రక్తప్రసార వేగం పెరుగుతుంది. రాత్రి పూట ప్రశాంతంగా పడుకోవాలంటే, ఈ టైప్ ఫుడ్ తగ్గిస్తేనే మేలు.

స్వీట్స్ 

పిల్లలకు డే అండ్ నైట్ తేడా లేకుండా స్వీట్లు, చాక్లెట్లు ఇస్తుంటారు. డే టైం ఎలా ఉన్నా.. నైట్ మాత్రం పిల్లల్ని ఇవి తిననీయొద్దు. వీటి వల్ల డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కెఫిన్ మిక్స్ అయిన చాక్లెట్లతో నిద్ర కూడా సరిగా పట్టదు. ఆ ఇబ్బందులు ఫేస్ చేయడం కన్నా.. నైట్ టైం స్వీట్స్ తినకపోవడం బెటర్.