పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినంత కాలం అమెరికా ఎలాంటి సాయం అందించరాదన్నారు ఐక్యరాజ్య సమతిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హాలీ. పాక్ ఉగ్రవాద సమస్యను పరిష్కరించేంత వరకు ఇస్లామాబాద్‌కు డాలర్ కూడా ఆర్ధిక సాయం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా పాక్ ఆశ్రయ మిస్తోందన్నారు. ఆ దేశం మొదట ఉగ్రవాద చర్యలను నిలిపి వేసేందుకు యత్నించాలన్నారు. సహాయం చేసినందుకు, దయా గుణానికి ప్రతిఫలంగా అమెరికా కేవలం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని మాత్రమే కోరుకుంటోందన్నారు. కానీ అమెరికా,ఐక్యరాజ్య సమితి జోక్యాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తూనే ఉందంటూ.. ఓ పత్రికా వ్యాసంలో నిక్కీ హేలీ తెలిపారు.
