ప్రధాని మోడీకి V6 బోనాల సాంగ్‌తో స్వాగతం : ఏ దేశమేగినా తెలంగాణ సంస్కృతిలో V6 News భాగం

ప్రధాని మోడీకి V6 బోనాల సాంగ్‌తో స్వాగతం : ఏ దేశమేగినా తెలంగాణ సంస్కృతిలో V6 News భాగం

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ జాతిని అన్నారు.. ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్న తెలంగాణ వాసులు అయినా.. తెలంగాణ సంస్కృతిలో V6 News బోనాలు, బతుకమ్మ పాటలు భాగం అయ్యాయి. విదేశాల్లో ఉండే తెలంగాణ వారికి పండుగ అయినా.. వేడుక అయినా V6 News నుంచి వచ్చిన బోనాలు, బతుకమ్మ పాటలే నిండుదనం ఇస్తున్నాయి. 

నిన్నటికి నిన్న మన దేశ ప్రధాని మోదీ.. సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లారు. ఎయిర్ పోర్టులో మన దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు.. వారి వారి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. సౌతాఫ్రికాలో ఉన్న తెలంగాణ ప్రజలు.. V6 News నుంచి డోలు డోలు  డోల్  డోలమ్మ డోల్ డోల్ పాటతో.. ప్రధాని మోదీకి స్వాగతం పలికారు అక్కడి మహిళలు. డోలు డోలు  డోలమ్మ డోల్ డోల్ పండుగే వచ్చింది అంటూ 2017లో వచ్చిన V6 News బోనాలు పాటతో మోదీకి స్వాగతం పలికారు తెలంగాణ మహిళలు. 

V6 News నుంచి వచ్చిన ఈ డోలు డోలు బోనాల పాట ఇప్పటికే ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. 220 మిలియన్స్ అంటే.. 22 కోట్ల వ్యూస్ తో ప్రపంచంలోనే టాప్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా.. బోనాల పండుగ అంటే డోలు డోలు పాటగా మహిళల నోట పాటగా మారిపోయింది.

జీ 20 సదస్సుకు సౌతాఫ్రికా వెళ్లిన మోదీకి.. ఎయిర్ పోర్టులో డోలు డోలు డోల్ అంటూ వీ6 బోనరాల పాటపై నృత్యం చేసిన తెలంగాణ మహిళలకు.. చప్పట్లతో అభినందించిన ప్రధాని మోదీ. డోలు డోలు  డోల్  డోలమ్మ డోల్ డోల్ .. అన్న వీ6 బతుకమ్మ పాటపై కళాకారులు చేసిన నృత్యాన్ని చూసిన ప్రధాన మంత్రి చప్పట్లతో కళాకారులను ఆభినందించారు. తనకు లభించిన ఈ స్వాగత వీడియోను ప్రధానమంత్రి ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.