
ముంబై: కార్వీ లాంటి స్కామ్ మరోసారి జరిగే ఛాన్సే ఇవ్వమని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చెయిర్‌పర్సన్ మాధబి పురి బుచ్ వెల్లడించారు. స్టాక్ బ్రోకర్లు మోసాలకు పాల్పడకుండా అవసరమైన అన్ని రెగ్యులేటరీ చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. సెబీ బోర్డు మీటింగ్ తర్వాత బుధవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఇన్సైడర్ ట్రేడింగ్, ఫ్రంట్రన్నింగ్వంటి అంశాలలో కఠినంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ ఉదంతంపై మీడియా అడిగిన ప్రశ్నలకు, ఈ అంశం కోర్టులో ఉందని తానేమీ కామెంట్ చేయలేనని బదులిచ్చారు. షేర్ ధరను ప్రభావితం చేసే సమాచారం ఏదైనా రూమర్ల రూపంలో బయటకు వచ్చినప్పుడు సంబంధిత కంపెనీ తప్పనిసరిగా ఆ రూమర్ నిజమా, కాదా అనే విషయాన్ని స్పష్టం చేసేలా రూల్స్ తెచ్చినట్లు సెబీ చీఫ్ వెల్లడించారు.
రూమర్...కరెక్టో, కాదో
వెంటనే చెప్పాల్సిందే...
అక్టోబర్ 1, 2023 నుంచి మొదలయ్యే మొదటి దశలో దేశంలోని టాప్100 కంపెనీలు ఈ కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఏప్రిల్ 1, 2024 నుంచి
టాప్ 250 కంపెనీలకు రూల్స్ వర్తింప చేస్తామని పేర్కొన్నారు. షేర్ల ధరలపై ప్రభావం చూపే అంశాలేమిటో అర్ధమయ్యేలా బెంచ్మార్క్స్తేనున్నట్లు మాధబి పురి బుచ్ తెలిపారు. డైరెక్టర్ల బోర్డు మీటింగ్ ముగిసిన 30 నిమిషాలలోపే సంబంధిత సమాచారాన్ని ఎక్స్చేంజీలకు తప్పనిసరిగా కంపెనీలు ఇవ్వాల్సిందేనని కూడా చెప్పారు.
కార్పొరేట్ డెట్ మార్కెట్ కోసం
బ్యాక్స్టాప్ ఫండ్....
లిక్విడిటీ ఎక్కువగా లేని ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ డెట్పేపర్లను కొనడం కోసం బ్యాక్స్టాప్ ఫండ్ ఏర్పాటు ప్రపోజల్‌ను కూడా సెబీ బోర్డు ఆమోదించింది. ఫైనాన్స్మినిస్టర్ కిందటేడాది బడ్జెట్లో ఈ బ్యాక్స్టాప్ ఫండ్ ప్రపోజల్‌ను ముందుకు తెచ్చారు.
సెకండరీ మార్కెట్‌కూ ఏఎస్బీఏ ....
ఐపీఓలలో సబ్స్క్రిప్షన్ కోసం అమలులో ఉన్న అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్బీఏ) తరహాలో సెకండరీ మార్కెట్ కోసం ఒక కొత్త పద్ధతిని తేనున్నట్లు సెబీ చీఫ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పద్ధతి బ్రోకర్లకు, ఇన్వెస్టర్లకు ఆప్షనల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఐపీఓలో షేర్లకు దరఖాస్తు చేసుకున్నా, ఫండ్స్ మాత్రం ఇన్వెస్టర్ సేవింగ్స్ అకౌంట్లోనే బ్లాక్ చేసి ఉంటాయి. అంటే, అప్పుడు కూడా ఇన్వెస్టర్‌కు వడ్డీ ఆదాయం దొరుకుతుందన్న మాట. రిటెయిల్ ఇన్వెస్టర్ల డబ్బుకు సేఫ్టీ పెంచాలనే ఈ పద్ధతి తెస్తున్నట్లు సెబీ చీఫ్ వివరించారు.