
నిర్మల్, వెలుగు : రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్ట్‌లను నోటిఫికేషన్లు ఇవ్వకుండానే అక్రమంగా భర్తీ చేస్తున్నారని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహిపాల్ యాదవ్ ఆరోపించారు.
నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాల్లో గతేడాది నుంచి అక్రమ నియామకాలు జరుగుతున్నాయన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో గతంలో కూడా అక్రమ నియామకాలు జరిగాయన్నారు. ఆర్డీవోను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించి, అవకతవకలపై రిపోర్ట్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
జెన్‌కో ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే 2018లో కాంటాక్ట్ ఒప్పందంపై ఉద్యోగాలను భర్తీ చేసి, 2022లో పర్మినెంట్ చేశారన్నారు.వీరి వద్ద నుంచి ఒక్కోపోస్ట్‌కు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఇప్ప బ్యాక్‌లాగ్ నియామకాలను దొడ్డిదారిన భర్తీ చేయడం ఆపాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.