వీరు హోలీ ఆడారంటే ఇబ్బందులే... ఈ తప్పులు అసలు చెయొద్దు...

   వీరు హోలీ ఆడారంటే ఇబ్బందులే... ఈ తప్పులు అసలు చెయొద్దు...

హోలీ రోజున రంగులతో ఆడుతూ.. ఆనందంగా  జరుపుకుంటారు.  కుటుంబసభ్యులు.. ఇరుగుపొరుగు వారు అందరూ కలిసి హోలీ పండుగను రంగులు జల్లుకుంటూ . ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను జరుపుకునేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  ఎలాంటి వారు హోలీ ఆడకూదడు.. వారు రంగులకు ఎందుకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం, , ,

హోలీ ఆడాలనే ఉత్సాహం అందరికీ ఉంటుంది. అందరూ కలిసి ఈ రంగుల పండుగను ఎంతో ఉత్సహంగా జరుపుకుంటారు. .. ఫంగల్ ఇన్ఫెక్షన్.. చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారితో హోలీ ఆడటం అంత మంచిది కాదు..ఎందుకంటే రంగులు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను తీవ్రతరం చేస్తాయి. ఒకరితో ఒకరు హోలీ ఆడటం వల్ల అది త్వరగా వ్యాపిస్తుంది. 

 షింగిల్స్ సమస్య ఉన్నవారితో కూడా హోలీ ఆడకూడదు. షింగిల్స్‌ను హెర్పెస్ జోస్టర్ అని అంటారు. ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. హోలీ ఆడటం వల్ల ఈ సమస్య వ్యాపిస్తుంది. 

బ్రాంకైటిస్ వ్యాధితో బాధపడేవారు శ్వాసకోశంలో మంటతో ఇబ్బంది పడుతుంటారు. హోలీ రంగులు ఈ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అలాంటి రోగి హోలీ ఆడకుండా చూడాలి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) ఉన్న వారికి కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. హోలీ రంగులు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

తామరతో బాధపడుతున్నట్ల వారితో హోలీ ఆడకూడదు. తామర రోగితో హోలీ ఆడకూడదు. తామరతో బాధపడుతున్న వారు హోలీ ఆడితే సమస్య మరింత తీవ్రమవుతుంది. సోరియాసిస్ ఉన్నవారు దురద, పొలుసుల చర్మం మొదలైన సమస్యలతో బాధపడుతుంటారు. హోలీ రంగు సమస్యను మరింత పెంచుతుంది. వారితో హోలీ ఆడటం వలన కూడా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది.

ఆస్తమా రోగులు.. హోలీ రోజున రంగులు ఎగురుతూ ఉండటం వల్ల ఆస్తమా రోగులకు ఊపిరి ఆడకపోవడం జరగవచ్చు. ఇలాంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. హోలీ ఆడాలంటే మంచి స్కిన్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ చర్మానికి రాసుకోవాలి. అలాగే కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. హోలీ రంగుల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అజాగ్రత్త తగదు.

ALSO READ :- మ్యానిఫెస్టోపై ఊరిస్తున్న వైసీపీ - ఆ రోజే ప్రకటన - కీలక అంశాలివే...