మ్యానిఫెస్టోపై ఊరిస్తున్న వైసీపీ - ఆ రోజే ప్రకటన - కీలక అంశాలివే...

మ్యానిఫెస్టోపై ఊరిస్తున్న వైసీపీ - ఆ రోజే ప్రకటన - కీలక అంశాలివే...

ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరో పక్క, సీటు దక్కని అసమ్మతి, వారిని బుజ్జగించేందుకు అధిష్టానం పడుతున్న తిప్పలు వెరసి ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా అధికార వైసీపీ మ్యానిఫెస్టో ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేనిఫెస్టో ప్రకటన ఇప్పుడు, అప్పుడు అంటూ వైసీపీ ఊరిస్తున్న నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

ఈ నెల 27న ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్న జగన్, ఆ ప్రచార సభలోనే వైసీపీ మ్యానిఫెస్టో కూడా ప్రకటిస్తాడని వార్తలొచ్చాయి. కానీ, 27న కూడా వైసీపీ మేనిఫెస్టో ప్రకటన ఉండబోదని తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేసారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 9న ఉగాది సందర్బంగా మేనిఫెస్టో విడుదల ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో మేనిఫెస్టోలో ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలతో పాటు  పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణాల మాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజాకర్షక పథకాలు ఉంటాయని తెలుస్తోంది. 

ALSO READ :-  IPL 2024: బుమ్రాతో కలిస్తే అంతే: ముంబై ఇడియన్స్ జట్టులో దక్షిణాఫ్రికా సంచలనం