ప్రవీణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు

ప్రవీణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దు

కోహెడ/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర లీడర్లు అన్నారు. ప్రవీణ్​రెడ్డి కాంగ్రెస్లో  చేరతారని ప్రచారం జరుగుతుండడంతో స్థానిక లీడర్లు బుధవారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో ఆయన నివాసంలో కలిశారు. ప్రవీణ్ రెడ్డిని చేరికను వ్యతిరేకిస్తూ వినతిపత్రం అందజేశారు. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్నవారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా హైకమాండ్ చూసుకుంటుందని పీసీసీ చీఫ్ చెప్పినట్లు వారు తెలిపారు. చేరిక విషయంలో స్థానిక లీడర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని, విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్యం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు లీడర్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కెడం లింగమూర్తి, జిల్లా ఉపాధ్యక్షు డు వంగర మల్లేశం, బస్వరా శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటి సత్యనారాయణ, మండల అధ్యక్షులు ఐలయ్య, ధర్మయ్య, ప్రకాశ్, సంతాజి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, చందు, అక్కు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.