‘దిశ’పై సినిమా తీయొద్దు: హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్

‘దిశ’పై సినిమా తీయొద్దు: హైకోర్టులో దిశ తండ్రి పిటిషన్

హైదరాబాద్, వెలుగు: ‘దిశ’ ఘటనపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా తీయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దిశ తండ్రి హై
కోర్టును ఆశ్రయించారు. సినిమాను సెంట్రల్ సెన్సార్‌‌ బోర్డు అడ్డుకోకపోవడాన్ని రిట్‌ లో సవాల్‌ చేశారు. తన కుమార్తె దిశ దారుణ
ఘటనను హైకోర్టు, సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించాయని, సుప్రీంకోర్టు పర్యవేక్షించే జ్యుడీషియల్‌ కమిషన్‌‌ విచారిస్తున్న తరుణంలో
దిశపై సినిమా ఎట్లా తీస్తారని ఆయన ప్రశ్నించారు. దిశ సినిమా తీయకుండా నిర్మాతలకు ఉత్తర్వులు ఇవ్వాలని, నిర్మాత, దర్శకులు ముందుకు వెళ్లకుండా ఆంక్షలు విధించాలని కోరారు.

ఈ రిట్‌ ను శుక్రవారం జస్టిస్‌ పి.నవీన్‌‌ రావు విచారించారు. సెన్సార్‌‌ బోర్డు అధికారుల వైఖరి ఏమిటని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెం ట్‌ సొలిసిటర్‌‌ జనరల్‌ ఎన్‌‌. రాజేశ్వర్‌‌ రావును ప్రశ్నించారు. దీనిపై రాజేశ్వర్‌‌ రావు స్పందిస్తూ, తాను కేంద్ర అధికారులను సంపద్రిస్తే.. పిటిషనర్‌‌ ఇప్పటి వరకూ ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని చెప్పినట్లు తెలిపారు. దీంతో పిటిషనర్‌‌ సెన్సార్‌‌ బోర్డుకు వినతిపత్రం సమర్పించు కోవచ్చునని, అధికారులు దానిని సత్వరమే పరిష్కరిం చాలని హైకోర్టు ఆదేశిం చింది.