
మెహిదీపట్నం, వెలుగు: అతి పురాతనమైన లంగర్ హౌస్ గ్రంథాలయాన్ని కార్వాన్ కు తరలించొద్దని అఖిలపక్ష నాయకులు డిమాండ్చేశారు. గురువారం ఉదయం లైబ్రరీని పరిశీలించారు. ఇక్కడి నుంచి తరలిస్తే ఊరుకోబోమన్నారు. 1960లో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్నియోజకవర్గ కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఇక్కడే కొనసాగించాలని కోరారు.