ఇంటర్​లో ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవద్దు.. పేరెంట్స్​కు బోర్డు సూచన

ఇంటర్​లో ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోవద్దు.. పేరెంట్స్​కు బోర్డు సూచన

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఎవ్వరూ అడ్మిషన్లు తీసుకోవద్దని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల అనఫిషియల్ గా కొన్ని కాలేజీలు అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.

2024–25  విద్యాసంవత్సరానికి అడ్మిషన్ షెడ్యూల్ చేయలేదని  తెలిపారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను tsbie.cgg.gov.in, acadtsbie.cgg.gov.in  వెబ్ సైట్లలో పెడ్తామని, వాటిల్లో మాత్రమే చేరాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు చేపడితే చర్యలు తీసుకుంటామని మేనేజ్మెంట్లను హెచ్చరించారు.