Kitchen Tips : నిమ్మకాయలు, పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి

Kitchen Tips : నిమ్మకాయలు, పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి

* టొమాటో గుజ్జు మంచి కలర్ రావాలంటే.. ఫుడ్ కలర్ తో పనిలేకుండా టొమాటోలు మిక్సీ పట్టేటప్పుడు ఒక చిన్న బీట్రూట్ ముక్క వేయాలి.

* నానబెట్టిన కందిపప్పుని కచ్చాపచ్చాగ మసాలా వడలకి రుబ్బినట్టు మిక్సీ పట్టాలి. అది మునిగేవరకు నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తే ఒకటి, రెండు విజిల్స్ లో ఉడుకుతుంది.

* నిమ్మకాయలు నెలరోజులు ఫ్రెష్ గా ఉండాలంటే.. వాటిని అల్యూమినియం ఫాయిల్లో చుట్టి, ఫ్రిజ్ లో పెట్టాలి. ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ లేకపోతే నిమ్మకాయల రసం తీసి ఐస్ క్యూబ్ ట్రేలలో పోసి ఫ్రిజ్ లో పెట్టాలి. కావాలనుకున్నప్పుడు ఆ నిమ్మరసం క్యూబ్స్ వాడుకోవచ్చు. 

• పచ్చి కొబ్బరి ఫ్రిజ్లో పెట్టిన రెండుమూడు రోజులకే రంగు మారి, బంకగా అవుతుంది కూడా. అలాకాకూడదంటే కొబ్బరిచిప్పలకి రెండుమూడు చుక్కల నిమ్మరసం పట్టించి ఫ్రిజ్లో పెట్టాలి. దీనివల్ల ఎన్నిరోజులైనా కొబ్బరి ఫ్రెష్ గా, టేస్టీగా ఉంటుంది. 

* ఉదయం చేసిన చపాతీలు మధ్యాహ్నానికి, గట్టి పడతాయి. వాటిని మెత్తగా చేయాలంటే.. పెద్ద మంటపై పాన్ని వేడిచేయాలి. దానిపై కొన్ని నీళ్లు చల్లి మిగిలిన చపాతీలను రెండువైపులా కాల్చాలి.

Also Read :డిజిటల్ సొల్యూషన్స్ పేరుతో మోసం చేస్తున్న ఐటీ కంపెనీ