ఫాస్ట్, ప్రాసెస్డ్ ఫుడ్ తరచూ తింటున్నారా..?

V6 Velugu Posted on Oct 26, 2021

  • అలా అయితే.. శరీరానికి పోషకాలందించే మెటబాలిజం మారుతుంది
  • ఆరోగ్య సమస్యలు కోరి తెచ్చుకున్నట్లే

మెటబాలిజం అనేది శరీరంలో జరిగే కెమికల్​ రియాక్షన్​. ఒక్కమాటలో చెప్పాలంటే తిన్న తిండిని శక్తిగా మారుస్తుంది. కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్​, మెగ్నీషియం వంటి షోషకాల్ని శరీరానికి అందించేది మెటబాలిజమే. దీనిలో  ‘కెటబాలిజం’, ‘ఎనబాలిజం’ అని రెండు రకాలుంటాయి. 
‘కెటబాలిజం’లో  ఫుడ్​లోని కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్​గా, ప్రొటీన్లు అమైనో యాసిడ్స్​గా,  ఫ్యాట్స్​ ​ ఫ్యాటీ యాసిడ్స్​ మారతాయి. శరీరంలో కొత్త కణాలు ఏర్పడడం, కణాలకి పోషకాలు అందడం వంటివి ‘ఎనబాలిజం’లో జరుగుతాయి.  
మెటబాలిజంలో మార్పులు
ప్రతి ఒక్కరి  డిఎన్​ఎ (డిఆక్సీరైబోన్యూక్లిక్​ యాసిడ్) వేరేలా ఉంటుంది. డిఎన్​ఎని బట్టి ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. మెటబాలిజం రేటు అందరిలో ఒకేలా ఉండకపోవడానికి ఇదొక కారణం. షుగర్​, బిపి సమస్యలు ఉన్నవాళ్లలో, చిన్నపిల్లల్లో, పెద్దవాళ్లలో, ఫిజికల్​గా యాక్టివ్​గా ఉండేవాళ్లలో మెటబాలిజం రేటు వేరేలా ఉంటుంది. అంతేకాదు, ఫుడ్​ని బట్టి కూడా మెటబాలిజం రేటు మారుతుంది. ​ తిండిలో పోషకాలు తగ్గినా, పోషకాలు సరిపడా అందకున్నా మెటబాలిజంలో మార్పులు వస్తాయి. 
మెటబాలిక్​ డిజార్డర్స్​
మెటబాలిజం డిజార్డర్స్ ఎందుకు వస్తున్నాయంటే...  టైమ్​కి తినకపోడం. ఫ్యాట్​, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం, ఎక్సర్​సైజ్ చేయకపోవడం వంటివి మెటబాలిజం నెమ్మదిగా జరిగేలా చేస్తాయి. ఏ పని చేయకపోవడంతో ఎనర్జీ  చివరికి ఫ్యాట్​గా మారుతుంది. ఫ్యాట్​ పెరిగితే కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హైపర్​ టెన్షన్​తో పాటు డయాబెటీస్ వంటి మెటబాలిక్​ డిజార్డర్స్​ వస్తాయి. ఇవేకాకుండా... కొందరు ఎంత తిన్నా బరువు పెరగరు. మరికొందరు కొంచెమే తింటున్నా కూడా బరువు పెరుగుతారు. 
ఇలా జరగడానికి కారణం మెటబాలిజం సరిగా జరగక పోవడమే. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మెటబాలిజం స్లో అవ్వకుండా చూసుకోవాలి.  
లక్షణాలు
నీరసంగా ఉంటుంది. ఆకలి వేయదు. తిన్నా సరిగా జీర్ణం అవ్వకపోవడం కూడా మెటబాలిజంలో మార్పులకి కారణమవుతుంది. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్​ని కలవాలి. 
మెటబాలిజం సరిగా జరగాలంటే
రోజుకి కనీసం గంట సేపు ఎక్సర్​సైజ్​ చేయాలి. దాంతో మెటబాలిజం వేగంగా జరుగుతుంది.
పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు ఎక్కువ తినాలి. వీటిలోని  ప్రొటీన్, ఫైబర్​లు మెటబాలిజం రేటుని పెంచుతాయి. కెమికల్స్​, ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్​ బాగా తగ్గించాలి​. 
ఫ్యాట్​ ఫుడ్ తినొద్దు. నీళ్లు బాగా తాగాలి. గ్రీన్​టీ తాగినా కూడా మెటబాలిజం వేగంగా జరుగుతుంది. 

మెటబాలిజం బూస్టర్స్ అయిన  పొప్పడి పండు రసం, దానిమ్మ, కమలాపండు రసం తాగుతుండాలి.  సోంపు టీ, లెమన్​ టీ, జింజర్​ లెమన్​ టీ వంటివి తాగితే మెటబాలిజం స్లో అవ్వదు.  మెటబాలిజం డిజార్డర్స్​ రాకుండా జాగ్రత్తపడొచ్చు కూడా. షుగర్​, బీపీ ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి. 
 

Tagged metabolism, healthy food, nutrients, fast food, good food, processed food

Latest Videos

Subscribe Now

More News