V6 ఎక్స్క్లూజివ్: చాదర్ ఘాట్ కాల్పుల FIR కాపీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవే !

V6 ఎక్స్క్లూజివ్: చాదర్ ఘాట్ కాల్పుల FIR కాపీ.. ఫుల్ డీటెయిల్స్ ఇవే !

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ కాల్పులకు సంబంధించిన FIR  కాపీ V6 న్యూస్ కు లభ్యమైంది. శనివారం (అక్టోబర్ 25) పోలీసులపై కత్తితో హత్యయత్నానికి ప్రయత్నించిన గ్యాంగ్ స్టర్ ఒమర్ పై డీసీపీ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు డీసీపీ చైతన్య. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలో డీసీపీ చేసిన ఫిర్యాదు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

 బషీర్ భాగ్ లో మీటింగ్ పూర్తిచేసుకుని ఆఫీస్ వెళ్లే క్రమంలో కోటి దగ్గర ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి దగ్గర మొబైల్ స్నాచింగ్  చేసి ఆటోలో పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు.  స్నాచింగ్ జరిగిన తీరును మా డ్రైవర్ సందీప్ చూసి నాకు  చెప్పాడు. నిందితులు 9395 అనే నెంబర్  ఆటోలో పారిపోతుండగా వెంబడించాం. ఆటోలో మొత్తం  ముగ్గురు ఉన్నారు.

ఒమర్ ను పట్టుకునేందుకు మా గన్మెన్ మూర్తి ప్రయత్నించాడు. మిగతా ఇద్దరు ఆటోలో పారిపోయారు. నిందితుడు ఒమర్ మా ఇద్దరిని కిందికి నెట్టేస్తే రోడ్ పై పడిపోయాం. ఇదే సమయంలో మూర్తి పిస్టల్ కింద పడింది.. నేను వెంటనే గన్ తీసుకున్నాను. పారిపోతున్న ఒమర్ పక్కన ఉన్న గల్లీలోకి వెళ్ళి బిల్డింగ్ ఎక్కాడు. బిల్డింగ్ టెర్రస్ మీదికి వెళ్లి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నేను మా గన్మెన్  రెండు బిల్డింగులు ఎక్కి ఒమర్ ను  పట్టుకునేందుకు ప్రయత్నించాం.

ఈ క్రమంలో మా గన్మెన్ మీద కత్తితో దాడి చేయబోయాడు ఒమర్. సహాయం కోసం మా గన్ మెన్ అరిచాడు . మా గన్ మెన్ ను నిందితుడు ఒమర్ కత్తితో చంపబోయాడు . గన్ మెన్ ను  కాపాడేందుకే నేను కాల్పులు జరిపాను. నిందితుడికి మేజర్ ఇంజురీ కాకుండా కాల్పులు జరిపాను. కాల్పులు జరిపినప్పటికీ నిందితుడు గన్ మెన్ పై కత్తి తో దాడి చేయబోయాడు.అందుకే రెండు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది.. అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.