ఏఐ మాయాజాలం.. యాప్ ఓపెన్ చేయకుండా.. ఫోన్తో మాట్లాడితే సరి.. ఆర్డర్ బుక్ అయిపోతుంది !

ఏఐ మాయాజాలం.. యాప్ ఓపెన్ చేయకుండా.. ఫోన్తో మాట్లాడితే సరి.. ఆర్డర్ బుక్ అయిపోతుంది !

స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్‌‌‌‌‌‌‌‌ కాఫీ తాగాలంటే రెడీ అయ్యేవరకు కనీసం ఐదు నిమిషాలైనా వెయిట్‌‌‌‌‌‌‌‌ చేయాలి. కానీ.. ఇకనుంచి అలా వెయిట్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీతో ఆర్డర్లు తీసుకుంటారట. ఈ విషయాన్ని స్వయంగా స్టార్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌ సీఈవో బ్రియాన్ నికోల్ ఓ కార్యక్రమంలో చెప్పాడు. ప్రస్తుతం దీనిమీద స్టార్‌ ‌‌‌‌‌‌‌బక్స్ ట్రయల్స్ చేస్తోంది. 

అందుకోసం ప్రత్యేకంగా ‘ఏఐ బరిస్టా’ అనే చాట్‌ ‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ ని డెవలప్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇప్పటికే స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్ డాట్‌‌‌‌‌‌‌‌ అసిస్ట్‌‌‌‌‌‌‌‌ అనే చాట్‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌ని వాడుతున్నారు. అది ప్రస్తుతం రకరకాల కాఫీలను రెడీ చేయడంలో, రోజువారీ పనుల్లో స్టోర్ లీడర్లకు సాయపడుతోంది. 

భవిష్యత్తులో స్టార్‌‌‌‌‌‌‌‌బక్స్ యాప్‌‌‌‌‌‌‌‌కి ఏఐ బరిస్టాని జోడించి కస్టమర్‌‌‌‌‌‌‌‌లు తమ కాఫీని మరింత ఈజీగా ఆర్డర్ చేసుకునే వెసులుబాటుని కల్పించనుంది. అందుకోసం కస్టమర్లు యాప్‌‌‌‌‌‌‌‌ని ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడితే సరిపోతుంది. “నాకు ఒక కోల్డ్‌‌‌‌‌‌‌‌ కాఫీ కావాలి. నేను మరో 10 నిమిషాల్లో స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటాను” అని చెప్తే చాలు. కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఏఐ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంది. ఆ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూసిన వెంటనే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్స్‌‌‌‌‌‌‌‌ కాఫీని రెడీ చేస్తారు. కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బక్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లేలోపు కావల్సింది రెడీగా ఉంటుంది.