ఇంటర్నెట్ వాడేవాళ్లలో వికీపీడియా తెలియని వాళ్లు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందిన ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియాల్లో ఇది పాపులర్. కానీ.. ఏఐ బూమ్ వల్ల ఇది కూడా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏఐ చాట్‌బాట్లను ఎక్కువగా వాడేవాళ్లు వికీపీడియాకు దూరమవుతున్నారు. అందుకే ఈ మధ్య వికీపీడియా ట్రాఫిక్ చాలావరకు తగ్గింది.
కానీ.. బాట్‌ల ట్రాఫిక్ మాత్రం పెరుగుతోంది. వాస్తవానికి వికీపీడియానే కొన్నేండ్లుగా ఎన్నో రకాల సమాచారానికి ప్రధాన మూలంగా ఉంది. అయితే.. ఈ సంవత్సరం మొదట్లో బ్రెజిల్‌లో ట్రాఫిక్ బాగా పెరిగింది. కానీ.. మనుషుల వల్ల పెరిగింది కాదు.. బాట్‌ల వల్ల పెరిగిన ట్రాఫిక్ అని వికీపీడియా ప్రతినిధులు చెప్పారు.
వాస్తవానికి ఏఐ బాట్‌లు స్క్రీన్ టైంతగ్గించడంలో చాలా సాయం చేస్తున్నాయి. అవి వికీపీడియాతోపాటు ఇతర వెబ్‌సైట్లలోని సమాచారాన్ని సేకరించి ఒకేచోట, ఈజీగా చదవగలిగే ఫార్మాట్‌లో అందిస్తున్నాయి. అందుకే ప్రత్యేకంగా వికీపీడియాలోకి వెళ్లి సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం తగ్గింది.
