తెలంగాణలో ఉన్న మొత్తం బొగ్గు నిల్వలు ఎంతో తెలుసా.?

తెలంగాణలో ఉన్న మొత్తం బొగ్గు నిల్వలు ఎంతో తెలుసా.?
  •      ఖనిజ వనరులను అధ్యయనం చేసే శాస్త్రం మినరాలజి. 
  •      మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని చోటానాగపూర్ ప్రాంతాన్ని పిలుస్తారు. 
  •      శివకాశి ప్రాంతాన్ని లిటిల్ జపాన్ అని తొలి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ పిలిచేవారు.
  •      రత్నగర్భ అని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పిలుస్తారు. 
  •      250 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ప్రకృతి ఉత్పాతాల వల్ల గోండ్వానా బొగ్గు     ఏర్పడింది. 
  •       దేశం మొత్తం బొగ్గు నిల్వల్లో 20 శాతం తెలంగాణలో విస్తరించి ఉన్నాయి. 
  •     తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలు అధికంగా బిట్యుమినస్ రకానికి చెందింది. 
  •      తెలంగాణ బొగ్గు గనులు ప్రాణహిత, గోదావరి లోయ ప్రాంతంలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.
  •      తెలంగాణలో బొగ్గు నిల్వలు అధికంగా ఉన్న జిల్లా మంచిర్యాల.
  •     రాష్ట్రంలో ఉన్న మొత్తం బొగ్గు నిల్వలు 10,528 మిలియన్ టన్నులు. 
  •     రాష్ట్రంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా కొత్తగూడెం.
  •     దేశంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం జార్ఖండ్.
  •      రాష్ట్రంలో హెమటైట్ రకానికి చెందిన ఇనుప ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయి. 
  •      హెమటైట్ నిల్వలు అధికంగా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.
  •      దేశంలో తొలి ఇనుప గని సింగ్భమ్.
  •     దేశంలో ఇనుప నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్.
  •  తెలంగాణలో బొగ్గు నిల్వలు అధికంగా విస్తరించి ఉన్నాయి. 
  •      రాష్ట్రంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్గొండ. 
  •      సిమెంట్ పరిశ్రమలో ప్రధాన ముడి సరుకు సున్నపురాయి. 
  •      రాష్ట్రంలో బొగ్గు నిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఖనిజం సున్నపురాయి. 
  •      బెరైటీస్​ను​ అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఖమ్మం.
  •      దేశంలో సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్.
  •      దేశంలో ముగ్గురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
  •     ప్రపంచంలో అతిపెద్ద ముగ్గురాయి గని మంగంపేట. 
  •      మాంగనీస్ నిల్వలు అధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. 
  •      మాంగనీస్​ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఒడిశా. 
  •      క్రోమైట్​ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఒడిశా.
  •     క్రోమైట్​ను అధికంగా ఉత్పత్తి చేసే జిల్లా ఖమ్మం.
  •     డోలమైట్ నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రం ఒడిశా. 
  •      డోలమైట్ నిల్వలు అధికంగా ఉన్న జిల్లా ఖమ్మం. 
  •      రాగి నిల్వలు విస్తరించి ఉన్న ప్రాంతం     కొత్తగూడెం. 
  •      మైకా ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో మ్మం జిల్లా ఉంది. 
  •      మైకాను ఎలక్ట్రానిక్ పరిశ్రమంలో విరివిగా ఉపయోగిస్తారు. 
  •      గుండూరు ప్రాంతం మైకా ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది.
  •     లాటరైట్ అధికంగా లభించే జిల్లా  ఆసిఫాబాద్. 
  •      లాటరైట్​ను ఇటుకల పరిశ్రమలో ఉపయోగిస్తారు. 
  •      సిద్ధిపేట జిల్లాలో స్టియటైట్ అధికంగా లభిస్తుంది.
  •      బంగారం ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. 
  •      దేశంలో అత్యంత లోతైన బంగారు గని హట్టి.
  •      గ్రానైట్ అధికగా విస్తరించి ఉన్న ప్రాంతం వరంగల్. 
  •      యురేనియం నిల్వలు అధికంగా ఉన్న జిల్లా జనగామ. 
  •