యోగాకి ఎలాంటి మ్యాట్స్ వాడాలో తెలుసా?

యోగాకి ఎలాంటి మ్యాట్స్ వాడాలో తెలుసా?

ఇప్పుడిప్పుడే యోగా నేర్చుకుంటున్నవాళ్లు జూట్​ లేదా పీవీటీ మ్యాట్స్​ను ఉపయోగించాలి. అదే కాస్త అడ్వాన్స్​డ్​ లెవల్​లో ఉన్నవాళ్లైతే... లైట్ వెయిట్​ఉండే మ్యాట్​లను ఎంచుకోవాలి. అప్పుడే వాళ్లు యోగా చేసేటప్పుడు గ్రిప్ దొరుకుతుంది. దాంతోపాటు ఆ మ్యాట్​చెమటను కూడా పీల్చేస్తుంది. బేసిక్​లెవల్​కు ఉపయోగించే పీవీటీ మ్యాట్​లను అడ్వాన్స్​డ్​ లెవల్​కు ఉపయోగిస్తే వర్కవుట్స్ చేసేటప్పుడు జారిపడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే చెమటను పీల్చే మ్యాట్​లను ఎంచుకోవాలి. ఇంకా బాగా గ్రిప్​ దొరకాలనుకునేవాళ్లు, జూట్​, పీవీటీ, రబ్బర్​ మ్యాట్​లను వాడొచ్చు. 

  • బిగినర్స్ కుషన్​ ఎక్కువున్న మ్యాట్​ వాడాలి. అది బ్యాలెన్సింగ్​ బాగుంటుంది. ఇవన్నీ రకరకాల రేట్లలో దొరుకుతాయి. ఎక్కువ రేటు ఉన్నది కొనడం కన్నా, మనకు కావాల్సింది కొనుక్కుంటే మంచిది అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.
  • సింథటిక్ మ్యాట్స్​ వాసన వస్తాయి, విషపూరితం కూడా. వాటిని దూరంగా ఉంచడం మంచిది. బిగినర్స్​కు జ్యూట్​ లేదా హ్యాండ్​లూమ్ మ్యాట్స్​ వాడొచ్చు. వాటికి అడుగున యాంటీ స్లిప్ ఆర్గానిక్​ రబ్బర్​ బాటమ్​ ఉంటుంది. అందువల్ల వాటిని చాలాకాలం వాడుకోవచ్చు. 
  • కార్క్ మ్యాట్స్​ను నేచురల్​ రబ్బర్​తో తయారుచేస్తారు. దానివల్ల ఎక్స్​ట్రా గ్రిప్​ దొరుకుతుంది. అడ్వాన్స్​డ్ లెవల్ వర్కవుట్స్​ చేసేవాళ్లకు ఇది బెస్ట్​. ఇది ఎకోఫ్రెండ్లీ కూడా. 

నాలుగు రకాల మ్యాట్​లు

  • పీవీటీ: పీవీటీ అంటే పాలీవినైల్​ క్లోరైడ్ అని అర్థం. సాధారణంగా యోగా మ్యాట్స్ అనగానే అందరూ వీటికే మొగ్గు చూపుతారు. ఈ మ్యాట్​తో గ్రిప్​ బాగా దొరుకుతుంది. దీన్ని రీసైకిల్​ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది టాక్సిక్​ మెటీరియల్స్​తో తయారుచేస్తారు. 
  • జ్యూట్​: దీని ధర తక్కువ. ఇది కూడా మంచి గ్రిప్ ఇస్తుంది. 
  • హ్యాండ్​లూమ్​: ఇవి యాంటీ స్లిప్​, ఆర్గానిక్​ రబ్బర్ బాటమ్స్​తో తయారవుతుంది. పైగా ఇవి ఎక్కువ కాలం వస్తాయి.
  • కార్క్​: దీన్ని రీసైకిల్ చేయడానికి వీలుగా తయారుచేశారు. దీనిలో నేచురల్​ రబ్బర్​ అడుగు భాగాన ఉండడం వల్ల ఎక్స్​ట్రా గ్రిప్​ ఉంటుంది.
  • రోప్స్ : ​కాస్త బరువుగా ఉండే రోప్ అయితే మంచిది. దానివల్ల కండరాలు గట్టిపడతాయి. డిజిటల్ రోప్​లో అయితే టైంతో జంపింగ్స్ కౌంట్​చూపిస్తుంది. అంతేకాకుండా రోజూ చేసే ట్రాక్​ను మార్చుకోవాల్సిన పనిలేదు. జంప్​ చేసేటప్పుడు టైంతోపాటు స్పీడ్ కంఫర్టబుల్​గా ఉందా? లేదా? చూసుకోవాలి. రెగ్యులర్​ వర్కవుట్స్​తో పాటు స్కిప్పింగ్ చేస్తే మంచిది.