పేజీలు తిప్పేటప్పుడు ఉమ్ము వాడుతున్నారా.. !

పేజీలు తిప్పేటప్పుడు ఉమ్ము వాడుతున్నారా.. !

పేజీలు తిప్పేటప్పుడు, నోట్లను లెక్కించేటప్పుడు ఉమ్ముతో చేతి వేళ్లను తడిచేసుకోవడం చాలామందికి అలవాటు. ఇలా పేజీలను తిప్పేటప్పుడు ఉమ్మును వాడకండి అంటూ అధికారులకు రాయ్ బరేలీ జిల్లా చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు దస్త్రాలు, పేజీలను తిప్పేటప్పుడు ఉమ్మును ఉపయోగించడం వల్ల అంటువ్యాధులు వస్తున్నాయని వారు చెబుతున్నారు. అందుకు బదులుగా తడి కోసం వాటర్ స్పాంజిలను వాడాలని సూచిస్తున్నారు.