
- బెంగళూరు తరహాలో ఏర్పాటుకు నిర్ణయం
- ఫీడర్స్ వారీగా కొనసాగుతున్న సర్వే
- మొదటి దశలో మెయిన్ రోడ్ల పక్కన..
- ఆ తర్వాలే బస్తీలు, కాలనీలపై దృష్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో భారీ వానలు పడినా, జోరు గాలులు వీచినా చెట్లు, కరెంట్ స్తంభాలు కూలి సరఫరా నిలిచిపోవడం శరామామూలే. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి అండర్‌గ్రౌండ్ కేబుళ్లపై టీజీఎస్పీడీసీఎల్ సన్నాహాలు చేస్తున్నది. కరెంట్‌వైర్లు, కేబుళ్లు బయటకు కనిపించకుండా భూగర్భంలో లైన్స్ వేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నది. బెంగళూరులో అండర్‌గ్రౌండ్ కేబుళ్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని అధికారులు చెప్తున్నారు. అక్కడ అండర్‌గ్రౌండ్ కేబుళ్లుఏ విధంగా పనిచేస్తున్నాయన్న విషయంపై రెండు నెలల కింద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్ఇంజినీర్లతో కలిసి పరిశీలించి వచ్చినట్టు సమాచారం.
అండర్గ్రౌండ్కేబుళ్లతో అక్కడచాలా సమస్యలు పరిష్కారం కావడంతో గ్రేటర్హైదరాబాద్పరిధిలోనూ వేసే విషయంపై ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ఏఏ ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ కేబుళ్లు ఉన్నవి, అండర్గ్రౌండ్కేబుళ్లుఎక్కడెక్కడ వేయాలన్న విషయంపై ఆయా ప్రాంతాల్లో ఉన్న ఫీడర్ల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రధాన రోడ్లపై ఉన్న ఓవర్హెడ్కేబుళ్లను తొలగించి అండర్గ్రౌండ్కేబుళ్లువేయాలని నిర్ణయించారు. దీని తర్వాతనే బస్తీలు, కాలనీల్లో కూడా అండర్‌గ్రౌండ్ కేబుళ్లువేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టీజీఎస్పీడీసీఎల్ మెట్రోజోన్ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇవీ ప్రధాన సమస్యలు..
ఓవర్హెడ్లైన్స్వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వర్షాలు పడినా, జోరు గాలులు వీచినా చెట్లు, స్తంభాలు కూలుతున్నాయి. ప్రతి వేసవిలోనూ కరెంట్‌తీగలను ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడానికి ఏటా కొంత మొత్తాన్ని అధికారులు కేటాయించాల్సి వస్తున్నది. చెట్లను ఆనుకుని ఉండే విద్యుత్లైన్లు తరచూ తెగిపోతున్నాయి. దీంతో విద్యుత్సమస్యలతోపాటు కొన్నిసార్లు పాదచారులు కరెంట్షాక్లకు గురవుతున్నారు. ఓవర్హెడ్కరెంట్ కేబుళ్లుఉన్న చాలా ప్రాంతాల్లో లైన్ల కింద భవనాలు పెరుగుతున్నాయి.
ఈ భవనాలపైకి వెళ్లి బట్టలు ఆరేసుకునే మహిళలు కరెంట్‌షాక్‌కు గురవుతున్నారు. సంక్రాంతి వేళ పతంగులు ఎగురవేసే యువత కూడా కరెంట్షాక్ల బారిన పడుతున్నారు. ఓవర్‌హెడ్ కేబుళ్ల వల్ల వచ్చే సమస్యలతో కరెంట్ సరఫరాలోనూ తరచూ అంతరాయం కలుగుతోందని అధికారులు చెప్తున్నారు. అండర్ గ్రౌండ్ కేబుళ్లు ఏర్పాటుచేస్తే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అధికారులు చెబుతున్నారు.
సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలు
ప్రస్తుతం సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఐదుగురు అధికారులు ఉన్నారు. సబ్స్టేషన్లు, ఫీడర్లు, ఓవర్‌హెడ్ లైన్లు, విద్యుత్ స్తంభాలను వీరు గుర్తించి అండర్‌గ్రౌండ్ లైన్స్‌కు ఎంత మేరకు ఖర్చవుతుందన్న నివేదికను వారు అందజేస్తారు. దానిని అనుసరించి గ్రేటర్లో అండర్‌గ్రౌండ్ కేబుళ్ల వ్యవస్థ ఏర్పాటుపై ముందుకు పోవాలని భావిస్తున్నారు.
గ్రేటర్లో ఇదీ లెక్క..
గ్రేటర్‌పరిధిలో ఉన్న 60 లక్షల విద్యుత్కనెక్షన్లలో దాదాపు 52 లక్షలు గృహ విద్యుత్కనెక్షన్లే. పాతబస్తీతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలంలో వేసిన ఓవర్‌హెడ్ లైన్సేఉన్నాయి. వీటిలో చాలా వరకు శిథిలావస్థకు చేరినట్టు అధికారులు గుర్తించారు. నగరంలో విద్యుత్ వినియోగం కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. సాధారణ రోజుల్లో రోజుకు 60 నుంచి 65 మిలియన్‌యూనిట్ల వినియోగం జరిగితే.. వేసవి, ప్రత్యేక సందర్భాల్లో రోజుకు 85 నుంచి 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది.
ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 33 కేవీ సబ్స్టేషన్లు 498 ఉండగా, 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుళ్లు 1,280 కి.మీ.మేరకు ఉన్నాయి. అలాగే 33 కేవీ ఓవర్‌హెడ్ కేబుళ్లు 21,640 కి.మీ. ఉన్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు 1,022 ఉన్నట్టు అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వ్యవస్థ ఏర్పాటయితే ప్రమాదాలు తగ్గి, కరెంట్ సప్లై మరింత మెరుగవుతుందని డిస్కం అధికారులు భావిస్తున్నారు.