వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి అన్నారు పెద్దలు. అవును మరి.. భారతంలోని సారాంశం.. గారెల్లోని రుచి రెండూ సమానమే. భారతం సారాంశం వింటే.. జీవితానుభవాలకు ఉపయోగపడుతుంది. గారెలు తింటే.. అందులోని పోషకాలు. ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అందుకే.. ఈ వారం మీకోసం గారెలు ఎలా చేసుకోవాలో ఇస్తున్నాం. అవి కూడా వెరైటీ వెరైటీ గారెలు. ఈ చలికాలంలో ట్రై చేయండి మరి!
చికెన్ గారెలు
కావాల్సినవి
గరం మసాలా టీస్పూను
కారం: 2 టీస్పూను, ఉప్పు సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి: 4 ( చిన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిగడ్డలు 3 ( సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పసుపు : పావు టీస్పూన్,
నూనె: సరిపడా
ఇలా చేయాలి
ఒక గిన్నెలో శనగపప్పు వేసి నీళ్లలో నానబెట్టుకోవాలి తర్వాత బికెన్ ముక్కలు శుభ్రంగా కడిగి కారం గనుమసాలా, అల్లం వెల్లుల్లి సిస్ట్ వేసి నీళ్లు పోసి ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వానబెట్టిన శెనగపప్పును మెత్తగా కున్నాలి. తర్వాత పేస్ట్ చేసుకొన్న తనగపప్పు ముద్దలో ఉల్లిముక్కలు చిన్న ముక్కలు, ఉడికించిన చికెన్ మసాలా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడుమీద పెట్టి నూనె వేడయ్యాక అందులో గా ముద్దను అరుదేతిలో తీసుకొనిరండునూనె వేగించాలి అంతే.. చికెన్ గారెలు రెడీ.
క్యారెట్ గారెలు
కావాల్సినవి
బియ్యప్పిండి: కప్పు,
క్యారెట్ తురుము కప్పు,
పచ్చిమిర్చి: ఐదు
ఉప్పు: తగినంత.
జీలకర్ర: చెంచా
నూనె: సరిపడా
తయారుచేసే విధానం
ముందుగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వెల్లులి.. కొద్దిగా ఉప్పును మిక్సీలో వేసి పేస్టు సిద్ధం చేయాలి. మిశ్రమంలో దీనిలో క్యారెట్ తురుము తగినంత బియ్యప్పిండి వేసి కలపాలి అందులో కలిపి పెట్టుకున్న పేస్టుతో పాటు ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలిపి నూనెలో వేగంచాలి.
పప్పు గారెలు
కావాల్సినవి
కందిపప్పు కప్పు
పచ్చిమి ఉప్పు తగినంత
జీలకర్ర చిటికెడు
నూనె: 4 కప్పులు
కరివేపాకు 2 రెబ్బలు.
ఉల్లిగడ్డలు : రెండు
కారం: చిటికెడు
ఇలా చేయాలి:
ముందుగా పప్పులను నాలుగైదు గంటల పాటు నానబెట్టండి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగి శెనగపప్పు సగం పక్కకు పెట్టుకోవాలి. మిగతా పప్పులు. పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కాస్త బరకగా రుబ్బాలి. తర్వాత తరిగిన ఉల్లిముక్కలు కలపాలి. ఇప్పుడు మిగిలిన శెనగపప్పును కూడా ఇందులో వేసి కలిపి పెట్టుకోవాలి. బాణాలి పెట్టి నూనె వేసి బాగా కాగాక తర్వాత పిండిని గారెల్లాగ పల్లి నూనెలో వేగించాలి... కరకరలాడే పప్పు గారెలు రెడీ
మొక్కజొన్న గారెలు
కావాల్సినవి
ఉల్లిపాయ ఒకటి,
పచ్చిమిర్చి : 4.
కొత్తిమీర : ఒక కట్ట (చిన్నది).
అల్లం చిన్న ముక్క
జీలకర్ర: 1 టీ స్పూన్,
శెనగపిండి: 2 టేబుల్ స్పూన్స్.
ఇలా చేయాలి
మొక్కజొన్న కంకిని వలిచి గింజల్లో తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి నీళ్లు కలపకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, మిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలపాలి. కార్న్ ఫ్లోర్ చేసి మళ్లీ కలపాలి. మొక్కుజొన్న కుంకులు లేతగా ఉండి. పిండి పలుచగా అయితే శెనగపిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుతూ నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేగించుకోవాలి. క్రిస్పీ క్రిస్పీగా తింటే టేస్టీగా ఉంటాయి.
అల్లం గారెలు :
కావాల్సినవి
ముద్దపప్పు : 2 కప్పులు
అల్లం ముద్ద: టీస్పూను
మిరియాలు : అర టీస్పూను
ఎండుకొబ్బరి తురుము: టీస్పూను.
ఉప్పు, నూనె: సరిపడా
ఇలా చేయాలి
ముందురోజు రాత్రే మినప్పప్పుని నానబెట్టాలి.. మిగతా దినుసులన్నీ మిక్సీలో వేసి రుబ్బాలి. చివర్లో నానబెట్టిన మినప్పప్పు నీళ్లు వంపేసి ఇదే మిశ్రమంలో కలిపి మిక్సీ పట్టాలి.ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని గారెలా వేగించాలి.వేడివేడిగా...కాస్త మసాలా చల్లుకొని తింటే.. కారంకారంగా బాగుంటాయి.
