Good Health: చలికాలంలో ఈ డ్రింక్ తాగితే... ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.. !

Good Health: చలికాలంలో ఈ డ్రింక్ తాగితే... ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు.. !

చలికాలం వచ్చిందంటే మంచుతోపాటు ఎయిర్ పొల్యూషన్ కూడా పెరుగుతుంది. దీనివల్ల ఆస్తమా పేషెంట్స్, ఊపిరితిత్తులు, శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. గాలి కాలుష్యం పెరగడం వల్ల కోల్డ్, ఫ్లూ వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువవుతాయి. అందుకే ఈ సీజన్లో ఇంట్లోనే సింపుల్గా తయారుచేసుకునే హెల్దీ డ్రింక్ తాగితే మంచిది. ఇది లంగ్ హీలర్ కూడా పని చేస్తుంది. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్.

కావాల్సినవి

  • అల్లం: చిన్న ముక్క
  • నల్ల మిరియాల పొడి: చిటికెడు
  • తులసి ఆకులు: ఐదు
  • లేత పసుపు కొమ్ము: చిన్న ముక్క
  • నీళ్లు: ఒకటిన్నర కప్పు

తయారీ

ఒక బౌల్లో నీళ్లు మరిగించాలి. మిరియాల పొడి, సన్నగా తరిగిన అల్లం ముక్క, పసుపు కొమ్ము ముక్క, తులసి ఆకులు వేసి ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఒక కప్పులో ఈ మిశ్రమాన్ని వడకట్టి, పిప్పి పడేయాలి. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పెంచి, వేడిని తగ్గిస్తాయి. వారానికి రెండు, మూడు సార్లు తాగితే సరిపోతుంది.

►ALSO READ | తింటే గారెలే తినాలి: ఇలా చేస్తే వారేవా అంటారు.. !