ఐస్క్రీమ్లో మనిషి వేలు..షాక్ తిన్న ఫుడీ..వీడియో వైరల్

ఐస్క్రీమ్లో మనిషి వేలు..షాక్ తిన్న ఫుడీ..వీడియో వైరల్

ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. తక్కువ సయమంలో శ్రమ లేకుండా ఇంటికే వస్తుంది కదా..అని చాలామంది తమకు ఇష్టమైన ఆహార పదార్ధాలను ఆన్ లైన్ యాప్ ల ద్వారా ఆర్డర్ చేస్తుంటారు.  కొందరు బిజీ అవర్స్ కారణంగా కూడా ఆన్ లైన్ ఆర్డర్ సర్వీస్ ను వినియోగించుకుంటారు. ఆన్ లైన్ ఆర్డర్ అనేది ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అందుబాటులో ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ మనం సెలెక్ట్ చేసుకున్న ఫుడ్ నాణ్యతపై ఇప్పుడు చాలామందికి  సందేహాలున్నాయి. ఇటీవల కాలంలో ఆర్డర్ చేసిన ఫుడ్ కు బదులుగా వేరేది రావడం, కుళ్లిపోయిన ఆహారం సర్వీస్ చేయడం, ఫుడ్ లో బొద్దింకలు రావడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ముంబైకి చెందిన  ఓ డాక్టర్ తన  చెల్లెలికోసం  ఓ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి.. డెలివరీ చేయబడిన ఐస్ క్రీమ్ చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అసలేం జరిగిందే తెలుసుకుందాం.. 

మనం ఫింగర్ చిప్ప్ గురించి విన్నాం.  కానీ ఫింగర్ ఐస్ క్రీం గురించి ఎప్పుడైనా విన్నారా?.. ఇక్కడా అదే జరిగింది.. ముంబై డాక్టర్ తాను ఆర్డర్ చేస్తే .. అతనికి ఫింగర్ ఐస్ క్రీమ్ డెలివరీ అయింది.ఫింగర్ ఐస్ క్రీం అంటే అదేదో.. కొత్త రకం ఐస్ క్రీమ్ అనుకుకోకండి.. డెలీవరీ అయిన ఐస్ క్రీం ను డాక్టర్ చెల్లెలు తింటుండగా.. ఐస్ క్రీంలో మనిషి వేలు ప్రత్యక్షమైంది. దీంతో ఆమెతోపాటు, డాక్టర్ షాక్ తిన్నారు. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

రంగంలోకి దిగిన పోలీసులు కేసే నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ ఐస్ క్రీమ్ డెలివరీ చేసిన యాప్ గురించి, ఐస్ క్రీం తయారు చేసిన కంపెనీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టారు.ఐస్ క్రీం తయారు చేసిన కంపెనీ యజమాని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసును ముంబై పోలీసులు సీరియస్ గానే తీసుకున్నట్లు చెబుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.