రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్ల 'బ్లాక్‌ డే'

రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్ల 'బ్లాక్‌ డే'

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ(మంగళవారం) దేశవ్యాప్తంగా డాక్టర్లు 'బ్లాక్‌ డే' ను పాటిస్తున్నారు. అల్లోపతి (ఆధునిక వైద్య చికిత్స) స్టుపిడ్‌ సైన్స్‌ అంటూ రామ్‌దేవ్‌బాబా ఇటీవల ఆరోపణలు చేశారు. డాక్టర్లపై విచక్షణా రహితంగా, అవమానకరంగా రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ పలు వైద్య సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) తెలిపింది. వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేశవ్యాప్తంగా బ్లాక్‌డే పాటించాలని పిలుపునిచ్చామని.. అంటువ్యాధుల చట్టం 1897 ప్రకారం రామ్‌దేవ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాదు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంది. దేశంలోని అత్యున్నత డాక్టర్ల సంస్థ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) కూడా బ్లాక్ డే కి మద్దతు నిచ్చింది.